Sunday, November 9, 2014

పాటల మిఠాయీలు !

పాటల మిఠాయీలు

మాటలు అంతమైనచోట సంగీతం ఆరంభమవుతుందంటారు.
కానీ సముద్రంలాంటి సంగీతం గురించి సరళంగా, ఆసక్తికరంగా రాయటం మాటలు కాదు.
సైన్సు విశేషాలను జనరంజక శైలిలో రచించిన రోహిణీప్రసాద్, తనకు పట్టున్న సంగీతం గురించి కూడా అంతే సుబోధకంగా వెబ్ పత్రికల్లో వ్యాసాలు రాశారు.
ఇవి సంకలనంగా రావాలని 2011లో ఆశించారు.
మరుసటి ఏడాదే అకాలమరణం పొందిన ఆయన స్మృతికి నివాళిగా ఈ పుస్తకాన్ని హెచ్ బీ టీ  వెలువరించింది.
అణుభౌతిక శాస్త్రజ్ఞుడే కాకుండా సితార్ విధ్వాంసుడూ, రచయితా కూడా అయిన రోహిణీప్రసాద్ కర్ణాటక, హిందుస్థానీ సంగీత విశేషాలనూ, రాగాలూ స్వరాలనూ వివరించారు. విశ్లేషించారు. సందర్భానుసారం స్వీయానుభవాలను మిళితం చేశారు. హిందుస్థానీ గాత్ర సంగీతంలోని ఘరానాల గురించి విలువైన సమాచారం అందించారు.

ముఖ్యంగా సినిమా పాటల్లోని రాగాలపై చేసిన లోతైన విశ్లేషణలు ముగ్ధుల్ని చేస్తాయి.
'కీ బోర్డ్ మీద రాగాలూ వ్యాసం ప్రాధమిక అంశాలను సచిత్రంగా వివరిస్తుంది.

శాస్త్రీయ సంగీతం గురించి సులభపధ్ధతిలో చెప్పేవారు లేకనే అది చిటారు కొమ్మన మిఠాయిపొట్లంలా మిగిలింది.
'ఈ వ్యాసాలు మిఠాయిని కిందకుదించి అందరికీ పంచుతాయి'  అన్న కె.బి.గోపాలం మాట నిజమేననిపిస్తుంది.

- సీ హెచ్ వేణు

( ఈనాడు ఆదివారం అనుబంధం 9-11-2014 సౌజన్యంతో )

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌