Wednesday, July 11, 2012

రామాయణం కాదు .. సరికొత్త... సచిత్ర ... ''భీమాయణం'' ...'అంటరానితనం అనుభవాలు' ... భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు ... చిత్రకళ: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం... కథనం: శ్రీ విద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌ ... తెలుగు అనువాదం : డి. వసంత ...

భీమాయణం

ఇదో అద్భుత పుస్తకం... బాధలు, సహానుభూతులు నిండిన తరతరాల ఆర్ద్రమైన దైహిక అనుభవాల సమాహారం.
- జాన్‌ బెర్జర్‌ ('పాలస్తీనా' పుస్తక రచయిత)

భారతదేశపు అతి ముఖ్య మేధావుల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత కథ... దశాబ్దాలుగా పనిగట్టుకునే మరుగుపరచబడుతోంది. దాన్నిప్పుడు ఈ ''భీమాయణం'' ఎంతో అసాధారణమైన అందంతో మన ముందుకు తెస్తోంది. దీన్ని మరచిపోవటం అసాధ్యం.
- అరుంధతీ రాయ్‌ (బుకర్‌ ప్రైజ్‌ విజేత 'గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌' రచయిత్రి)

భారతదేశంలో అంటరానివారిగా జీవించటమంటే ఏమిటి?
భారతీయుల్లో కొందరు తమ సాటివారిని ఎందుకు ముట్టుకోరు?
భారతదేశపు విప్లవాత్మక సంస్కర్తల్లో అగ్రగణ్యులైన భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ (1891-1956) ఒక అస్పృశ్యుడిగా తాను ఎదుగుతున్నక్రమంలో ఎదుర్కొన్న అనుభవాలను అక్షరబద్ధం చేశారు.
పదేళ్ల వయసులో స్కూల్‌లో,
కొలంబియా యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడాలో,
ప్రయాణాల్లో...
ఇలా ఎన్నోచోట్ల చాలా 'సర్వసాధారణంగా' తాను వివక్షను ఎదుర్కొన్న తీరును వివరించారు అంబేడ్కర్‌.
ప్రతికూలతలకు ఎదురొడ్డి అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ ముసాయిదా రాశారు.
తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించారు.
నాడు అంబేడ్కర్‌కు ఎదురైన అనుభవాల్లాంటివే
నేడు భారతదేశంలోని 17 కోట్ల మంది దళితులనూ వెన్నాడుతూనే వున్నాయి.
ఇప్పటికీ వారికి ప్రాథమిక అవసరాలైన నీరు, నీడ వంటివి తిరస్కరింపబడుతూనే వున్నాయి.

ఈ వినూత్న ప్రయత్నంలో పార్థాన్‌ గోండు చిత్రకారులైన దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాంలు మహద్‌ సత్యాగ్రహం వంటి చారిత్రక ఘట్టాలను నేటి సమకాలీన భారత సమాజంలోని ఘటనలతో కలగలిపి కథ అ ల్లటం విశేషం.

సంప్రదాయ బొమ్మల, గ్రాఫిక్‌ పుస్తకాల వ్యాకరణాన్ని ధిక్కరిస్తూ, తమదైన మాంత్రిక కళను ఇతిహాస స్థాయిలో రూపుకట్టిస్తూ గ్రాఫిక్‌ కళా రంగానికే ఒక కొత్త నుడికారాన్నీ, సరికొత్త జవజీవాలనూ అందించారు.

భీమాయణం ...
- 'జీవితంలో తప్పనిసరిగా చదవాల్సిన 1001 కామిక్స్‌'
పుస్తకాల్లో
స్థానం సంపాదించుకుంది.
- సిఎన్‌ఎన్‌ ప్రకటించిన 'ఐదు అత్యుత్తమ రాజకీయ కామిక్స్‌ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
- 2011 సంవత్సరానికి గాను 'ఫ్రీడమ్‌ టు క్రియేట్‌' అవార్డుకు సిఫారసు చేయబడింది.
- 2012 'ద వైట్‌ రావెన్స్‌' అవార్డు పరిశీలనకు ఎంపికైంది.

ఇంగ్లీషులో విశేష ఆదరణ పొందిన ఈ పుస్తకం
కన్నడ, హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, స్పానిష్‌ , ఫ్రెంచ్‌, కొరియన్‌ భాషల్లోకి
కూడా అనువాదమయింది.

తప్పక చదవండి:

భీమాయణం

భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు, అనుభవాలు

చిత్రకళ: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం
కథనం: శ్రీ విద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌
ఆంగ్లమూలం: Bhimayana: Experiences of Untouchability by Navayana Publishing, 2011.

తెలుగు అనువాదం : డి. వసంత
1/4 demy 107 పేజీలు, వెల : రూ. 200/-

ప్రచురణ కర్తలు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ &
నవయాన

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
E Mail: hyderabadbooktrust@gmail.com


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!

వివరాలకు ...ఇక్కడ ... క్లిక్ చేయండి !

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌