Saturday, September 17, 2011

మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మత విశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవీ 'ఇన్‌హేలర్ల' స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గానీ, సమాజపు ఆరోగ్యానికి గానీ పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా వాటి 'సైడ్‌ఎఫెక్ట్స్‌' చాలా ప్రమాదకరమైనవి.

వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే వుంది.

ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతాభావమూ కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నమే.

ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్థిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకూ గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకమూ, బలహీనతా కాదు.

దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.''

మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది?
మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి?
మతాల నేపథ్యం లాభనష్టాల గురించి విస్తృత అధ్యయనంతో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.

రచయిత: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
జననం: మద్రాసులో 1949లో
విద్యాభ్యాసం: మద్రాసు, ఆంధ్ర, ముంబయి విశ్వవిద్యాలయాల్లో
అణుభౌతికశాస్త్రంలో పి.హెచ్‌డి.
ఉద్యోగం: మొదట బాబా అణుకేంద్రంలో, ప్రస్తుతం ఇ.సి.ఐ.ఎల్‌.లో.
అభిరుచులు: శాస్త్రీయ సంగీతం, జనరంజక విజ్ఞాన రచనల్లో ఆసక్తి, అభినివేశం.
ఇతర రచనలు: జీవశాస్త్ర విజ్ఞానం, సమాజం (జనసాహితి), విశ్వాంతరాళం, మానవ పరిణామం, జీవకణాలూ, నాడీ కణాలూ (స్వేచ్ఛా సాహితి)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి బ్లాగును "ఇక్కడ" సందర్శించండి :
http://rohiniprasadkscience.blogspot.com

మనుషులు చేసిన దేవుళ్లు
కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
196 పేజీలు, వెల: రూ.100/-
తొలి ముద్రణ: ఆగస్ట్‌, 2011

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

2 comments:

  1. ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టాను...

    దైవభావన మనుషులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందనే అభిప్రాయాన్ని ఎందరో భక్తుల నిరంతర ఆందోళనలు పూర్వపక్షం చేస్తుంటాయి. వాస్తు భయాలూ, దేవతల ఆగ్రహాలూ, పరిహారాలూ, కీడులూ, శాంతులూ,జ్యోతిష గండాలూ... వీటిలో ఒక్కటైనా లేని మతాలను చూడం!

    టపా శీర్షికలో (రెండు చోట్ల) రచయిత పేరు సరిగా రాలేదు, సరిచేయండి.

    ReplyDelete
  2. వేణు గారూ
    మీ స్పందనకు ధన్యవాదాలు.
    తప్పుని సరిదిద్దాం.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌