Tuesday, December 7, 2010

నేనెందుకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

భిన్న మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి  అన్వయించుకొని విశ్లేషించడం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ణాతురాలు క్యారాన్ ఆం స్ట్రాంగ్. ఆమె రాసిన "హిస్టరీ ఆఫ్ గాడ్" పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. ౩౦ భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యం లో ఆం స్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - "ముహమ్మద్ - ఎ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్" దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం. - ఆంద్ర జ్యోతి.
(ఆంద్ర జ్యోతి 7-12-2010  సౌజన్యంతో )

1 comment:

  1. బైబిల్లో "కూడా" హింసను ప్రేరేపించే వాక్యాలున్నాయి అన్నారు సంతోషం. కానీ వాటిని అక్షరశ: పాటించాలన్న చాదస్తం ఎంతమంది క్రైస్తవులకుంది? ఈ నాటికి మా మతగ్రంధం చిన్న మార్పుకు కూడా గురికాలేదు అని గర్వంగా చెపుకొనేది ఎవరు (ఆ పాటికదేదో గొప్పవిషయమైనట్లు)? విమర్శకు అత్యంత తీవ్రంగా స్పందించే మతం ఏది? మహమ్మద్ బోధనల్లో సంబధ్ధత వున్నట్లు నాకైతె అనిపించలేదు. ఒకచోట క్షమించమని మరొకచోట తెగ నరకమని ఇదీ వరస. ఇకపోతే మేధస్సు గురించి, ఈయన చెప్పినవన్నీ ఆనాటి ఇతరమతగ్రంధాల్లోనుంచి సేకరించబడినవేనని ఒక విమర్శ వుంది. ప్రవక్తలు నిజంగా తెలివైనవారే అయుంటే దివ్యదృష్టి కలిగినవాలే అయ్యుంటే రకరకాల అన్వయాలకు ఆస్కారమిచ్చే బోధనలు కాకుండా "ఇదీ చేయాల్సింది" అని ఖచ్చితమైన అదేశాలిచ్చి వుండేవారు. ఆకాలపు విలువలనే పరిగణలోకి తీసుకున్నా ఈయన నైతిక వర్తన మీదున్న ఆరోపణలైతే సరేసరి.

    ప్రస్తుతం చలామణిలో వున్న విలువలను అనుసరించి కొన్ని హింసను ప్రేరేపించే బోధనలను పాటించనవసరంలేదు అని మనం అభిప్రాయపడుతున్నాం(?). అంటే మన నైతికత/అవగాహన స్థాయి ఆయా బోధనలు వెలువరించిన వారి కన్నా ఒక మెట్టు పైస్థాయిలోవుంది(కనీసం ఆయా విషయాలలో) మరలాంటప్పుడు ఆ గ్రంధాలు ఉన్నఫళంగా మనల్ను సరైనదారిలో పెట్టడానికి ఎలా పనికివస్తాయనేది నాప్రశ్న.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌