Sunday, November 28, 2010

ఉత్కంఠ భరితం ''చంద్రగిరి శిఖరం'' - ఆంధ్రజ్యోతి


'వనవాసి', 'పథేర్‌ పాంచాలి'ల రచయిత బిభూతి భూషణ్‌ బందోఫాధ్యాయ రాసిన మరో పుస్తకమే ''చంద్రగిరి శిఖరం''.
సాహసాలు ఇష్టమున్నవాళ్లకు విధిగా నచ్చే పుస్తకం.
ఎక్కడ బెంగాల్‌! ఎక్కడ ఆఫ్రికా!
శంకర్‌ అనే కుర్రాడు చిన్న ఉద్యోగం కోసం అక్కడిదాకా వెళ్లి అడుగడుగునా ప్రమాద భరిత, సాహసోపేత జీవితం గడుపుతూ తనతో పాటు మననూ ఆ జీవితం లోకి లాక్కుని పోతాడు.
అందులో మనిషి కాలుమోపని కొండలు, అడవులు, ఎడారులు, మన మెన్నడూ కనీవినీ ఎరుగని జంతువులు, పక్షులు, కీటకాలు ఎన్నో
తారసిల్లుతాయి. 


వర్షాలు, వరదలు, తుఫానులే కాదు అగ్నిపర్వతం  పేలడం కూడా చూస్తాం. అక్కడ వీటన్నిటిమధ్యా ఒకరిద్దరు విదేశీ సీనియర్‌ సాహస
యాత్రికులతో కలిసి అమూల్యమైన వజ్రాల వేటలో మన శంకర్‌..

ఎటువంటి ప్రయాణం అది!
ఒళ్లు గగుర్పొడిచే సాహసయాత్ర.
వజ్రాలు దొరుకుతాయా లేదా అనే ఉత్కంఠ కంటే శంకర్‌ క్షేమంగా తిరిగొస్తాడా లేడా అనే ఉత్కంఠే ఎక్కువ కలుగుతుంది మనకి.
కానీ, శంకర్‌కి వజ్రాలకంటే, తన క్షేమం కంటే, ఆ అనుభవమే ముఖ్యం. అనుభవం కోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమైన వాణ్ణి పాఠకులు

అక్కున చేర్చుకోకుండా ఉండగలరా?
కాకపోతే పాఠకులకు ఎడతెగని సస్పెన్స్‌ కల్పించడం కోసం శంకర్‌ ప్రయాణాన్ని మరీ సుదీర్ఘం చేసినట్టనిపిస్తుంది.

కాత్యాయని గారి అనువాదం అచ్చ తెలుగులాగే వుంది.
అన్నిటికీ అన్ని తెలుగు పేర్లు వెతికి రాయగలిగారామె.

ఇంతకాలం ఈ పుస్తకం తెలుగులో ఎందుకు రాలేదా అని ఆశ్చర్యమేస్తుంది.


-ఆంధ్రజ్యోతి, ఆదివారం, 28-11-2010

చంద్రగిరి శిఖరం
-బిబూతి భూషణ్‌ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు: 104, వెల: రూ.50/-


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇ మెయిల్‌:   hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌