Sunday, February 1, 2009

ఆర్థిక సంస్కరణలు - సంక్షేమాలకు అందని ప్రజలు - కె.ఎస్‌.చలం


....మన దేశంలో ఆర్థిక సంస్కరణలని 1991లో అధికారికంగా ప్రారంభించారు.
ప్రభుత్వాలు మారినప్పటికీ ఆర్థిక సరళీకరణ విధానాల విషయంలో పాలక పక్షాల్లో ఎలాంటి విభేదాలు కనిపించడంలేదు.
కొద్ది మంది కమ్యూనిస్టులు మినహాయిస్తే దాదాపు అన్ని పార్టీలవారూ ఆర్థిక సంస్కరణలను రెండు చేతులా ఆహ్వానిస్తున్నారు లేదా
వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తున్నారు.

... ఈ ఆర్థిక సంస్కరణల అసలు లక్ష్యం ఏమిటి?

... వీటివల్ల ఎవరికి ఎక్కువ లబ్ది కలుగుతుంది?

... వీటి దుష్ప్రభావం నుంచి కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం కంటితుడుపుగా అమలు పరుస్తున్న గుప్పెడు సాంఘిక సంక్షేమ
కార్యక్రమాలు, సబ్సిడీలు బలహీనవర్గాల వారిని ఎంత వరకు ఉద్ధరిస్తున్నాయి?


తదితర ప్రశ్నలకు సమాధానలు వెదికేందుకు చేసిన ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం.

ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూలేనటువంటి ఒక విలక్షణమైన కుల వ్యవస్థ మన దేశంలో వేళ్లూనుకుని వుంది.

తత్ఫలితంగా షెడ్యూల్డ్‌ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాలు, గ్రామీణ చేతివృత్తుల పనివారు, పట్టణ ప్రాంత పారిశ్రామిక కార్మికలు,
దళిత మహిళలు మొదలైనవారిపై ఆర్థిక సంస్కరణల దుష్ప్రభావం అమితంగా వుంది.

విద్య, పారిశ్రామిక రంగాలు ఎంత వేగంగా ప్రైవేటీకరణకు గురవుతున్నాయో ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాల వారు అంత వేగంగా తమ
హక్కుల్ని, అభివృద్ధి అవకాశాలని కోల్పోతున్నారు.

రిజర్వేషన్‌ విధానమే తన ప్రాథాన్యతను కోల్పోతోంది.

మరోపక్క అగ్రకులాలకూ, అగ్రవర్గాలకే అన్ని అవకాశాలు పరిమితమైపోతూ సామాజిక వైరుధ్యాలు పెరిగిపోతున్నాయి.

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం ఆంధ్ర యూనివర్సిటీలో అకాడమిక్‌ స్టాఫ్‌ కాలేజ్‌ డైరెక్టర్‌గా వున్నారు. ఇటీవల వస్తున్న
దళిత, ప్రత్యామ్నాయ చరిత్ర, ఆర్థిక విధానాలు, కుల సంఘాలు, ఆర్థిక శాస్త్రం, విద్య తదితర అంశాలపై లోతైన ఆధ్యయనాలు చేశారు.

ఆర్థిక సంస్కరణలు - సంక్షేమాలకు అందని ప్రజలు
- కె.ఎస్‌. చలం

ఆంగ్గ్ల మూలం: Economic Reforms and the Missing Safety Nets, Vikas Adhyayan Kendra, Mumbai, 1999.

అనువాదం: కలేకూరి ప్రసాద్‌
ప్రథమ ముద్రణ: 1999
51 పేజీలు, వెల: రూ.15


......................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌