Tuesday, June 24, 2008

తల్లి దండ్రుల తలనొప్పి


తల్లి దండ్రుల

తలనొప్పి

గిజుభాయి

తెలుగు అనువాదం: పోలు శేషగిరిరావు

పేజీలు 100 - వెల: రూ.18


పిల్లలను పెంచడం ఒక కళ. అది తలనొప్పి కానే కాదు.

పిలలతో కలిసి ఎదగడంలో ఆనందం వుంది.

జీవిత సార్థకత వుంది.

పిల్లలను సరిదిద్దాలంటే ముందుగా వాళ్ల తల్లి దండ్రుల్ని

దృష్టిలో వుంచుకోవాలి.

శ్రీగిజుభాయి పిల్లలన్ని పెంచే తల్లిదండ్రుల్ని ఇదెక్కడి తలనొప్పి

అనుకోవద్దంటున్నారు.

ఈసఫ్‌ కథలు, పంచతంత్రం, హితోపదేశాలతో పోల్చ దగిన

కథల సమాహారమే ఇదెక్కడి తలనొప్పి.

సరళ సుందరమైన శైలిలో గిజూభాయి ఈ పుస్తకం చదివినవారి

మనస్సుపై చెరిగిపోని ముద్ర వేస్తారు.

ఈ కథలు కొత్తవి కావు.

ఇవి ఇంటింటి కథలు, ప్రతి ఇంటి కథలు.

చదువుతున్నప్పుడు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి.

నిజమే సుమా అనిపిస్తాయి.

పిల్లలతో చేయించతగిన పనులూ,

చేయించకూడని పనులూ, పిల్లల భవిష్యత్తు గురించిన

ఉచితమైన నిర్ణయిలూ, అనుచితమైన నిర్ణయాలనూ

ఈ కథలు చక్కగా బోధిస్తాయి.

పిల్లల్ని అర్థం చేసుకోవటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే.

సిద్ధాంతాలూ, తాత్విక చర్చలతో తలనొప్పి కలిగించకుండా

ఆహ్లాదకరమైన రీతిలో చిన్న చిన్న కథలలో జీవిత సత్యాలను

అలోకగా అందిస్తుంది యీ పుస్తకం.



3 comments:

  1. కొత్త బ్లాగా!మంచి ప్రయత్నం! మీ కేటలాగు కూడా ఇక్కడ పెడితే విశాలాంధ్రకు వెళ్ళి వెతుక్కునే పని లేకుండా పని జరిగిపోతుంది.

    ReplyDelete
  2. సుజాత గారన్నట్టు, ఇక్కడ మీ catalog ఒకటి పెట్టండి! మీ contact details ఇవ్వండి. కనీసం మీ ఇమైల్ అడ్రస్సు ఇవ్వండి. మీ ప్రచురణలకి ఇక్కడ నుంచే ఆర్డర్ పెట్టుకునే సదుపాయం కలిగించండి. మీరు చాలా బాగా ఈ బ్లాగు ని మీ పుస్తకాలకోసం వాడుకోవచ్చు. చక్కటీ ప్రయత్నం. గీత గారు ఎలాఉన్నారు?

    ReplyDelete
  3. ఇప్పటివరకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకాల జాబితా మే నెల పోస్టింగ్‌లో వుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న పుస్తకాల కెటలాగ్‌ను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే పొందు పరుస్తాం. కృతజ్ఞతలతో

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌