Wednesday, June 25, 2008

హెచ్‌ఐవి, ఆరోగ్యం, మనమూ మన సమాజం



హెచ్‌ఐవి ఆరోగ్యం మనమూ మన సమాజం



ర్యూబెన్‌ గ్రానిచ్,‌ జోనథన్‌ ‌
తెలుగు అనువాదం ప్రభాకర్‌ మందార
వైద్యుడు లేనిచోట, మనకు డాక్టర్‌ లేని చోట ప్రచురణ కర్తలనుండి

ఆంగ్ల మూలం: హెచ్‌ఐవి హెల్త్‌ అండ్‌ కమ్యూనిటీ...ఎ గైడ్‌ ఫర్‌ యాక్షన్‌, ది హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ కాలిఫోర్నియా , యుఎస్‌

పేజీలు 248 వెల: రూ. 100

ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా చడీ చప్పుడు లేకుండా వ్యాపిస్తూ మానవాళిని కబళిస్తున్న మహమ్మారి హెచ్‌ఐవి.

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటే ఏమిటో తెలియకుండానే అనేకమంది దీని బారిన పడుతున్నారు. ఈ తెలియనితనం, అమాయకత్వం కారణంగానే హెచ్‌ఐవి ఇంతగా విజృంభిస్తోంది.
ఈ పుస్తకం హెచ్‌ఐవి గురించిన శాస్త్రీయ సమాచారాన్నీ, దేశదేశాలలో హెచ్‌ఐవి నివారణ, బాదితుల సంరక్షణ కొరకు సాగుతున్న కృషినీ, వివిధ స్వచ్ఛంద సంస్థల, వ్యక్తుల అనుభవాలనీ మనకు అందిస్తుంది.

ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలకూ
, హెచ్‌ఐవిపై ప్రజా చైతన్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారికీ, హెచ్‌ఐవి సోకిన వారికీ, వారి బాగోగులు చూస్తున్న వారికీ ఈ పుస్తకం ఒక అద్భుతమైన గైడ్‌లా తోడ్పడుతుంది.

చదివించేగుణం, స్పష్టత, సమగ్రత, ఆకర్షణీయమైన శైలి దీని ప్రత్యేకతలుగా పేర్కొనవచ్చు

హెచ్‌ఐవి అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎట్లా వుంటాయి? హెచ్‌ఐవి ఎట్లా వ్యాపిస్తుంది? రోగ నిర్ధారణ పరీక్షలు ఏవిధంగా చేస్తారు? హెచ్‌ఐవి పరీక్షకు ముందూ, తరువాతా కౌన్సెలింగ్‌ను ఏవిధంగా నిర్వహించాలి? హెచ్‌ఐవి వున్నవారికి ఏవిధమైన అవకాశవాద వ్యాధులు సోకుతాయి? వాటి చికిత్సకి ఏ మందులు వాడాలి? ఆ మందులకు సైడ్‌ ఎఫెక్ట్‌లు ఏమైనా వుంటాయా? హెచ్‌ఐవి బాదితుల సహాయం కోసం ఒక ప్రాజెక్టును ప్రారంభించాలంటే ఏం చేయాలి? వివిధ స్వచ్ఛంద సంస్థల, వ్యక్తుల, బాధితుల అనుభవాలు ఏవిధంగా వున్నాయి? వంటి అనేక అంశాలు ఇందులో వున్నాయి.

ఈ పుస్తక రచయితలు డా.ర్యూబెన్‌, డా. జోనథన్‌ మెర్మిన్‌ అనేక దేశాల్లో హెచ్‌ఐవి తాలూకు విద్య, వైద్య సంరక్షణ, సాంక్రమిక వ్యాధులు, ప్రభుత్వ విధానాలు, ప్రయోగశాల పరిశోధనలు వంటి విభిన్న రంగాలలో విశేషంగా కృషి చేశారు. వారు తమ అనుభవాల సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రచించారు. ప్రపంచమంతటా విశేష ప్రాచుర్యాన్ని పొందిన ''వైద్యుడు లేనిచోట'' (వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌) గ్రంథకర్తలైన హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ వారే ఈ పుస్తకాన్ని వెలువరించారు.

ఈ పుస్తకానికి ప్రభాకర్‌ మందార తెలుగు అనువాదం చేశారు. గతంలో వీరు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ''భారతదేశంలో మందుల విషాదం, జబ్బుల గురించి మాట్లాడుకుందాం, నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు, వైద్య వ్యాపారం , దేశంకోసం - భారీ డ్యాముల మానవ మూల్యం'' వంటి పలు పుస్తకాలను అనువదించారు.









No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌