Friday, July 22, 2016

మానసిక వ్యాధులనేవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి . మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు . మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే . వీటికీ చికిత్స వుంది. ఇవి కూడా పూర్తిగా నయమవుతాయి. మానసిక బాధపడే వ్యక్తులకు మంచి చికిస్తాను పొందే హక్కు వుంది.
ఈ పుస్తకమే ఇప్పటికీ 15 భాషల్లోకి అనువాదమయినది . ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు :280
ధర : 250/- 

ఓడి గెలిచిన మనిషి ,మల్లారెడ్డి : సంపాదకురాలు : శోభాదేవి

మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి  రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచన దృక్పథం  నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది.ఎందుకంటే, ఇందులో స్కిజోఫ్రీనియా లాటి  మానసిక జబ్బు ఎంతటి వేదనకు గురిచేస్తుందో మనకు కొత్తగా తెలుస్తుంది. భారతదేశంలోని మానసిక ఆరోగ్యం పరిరక్షణాలోని నాణ్యత, సంఘంలో ఈ వ్యాధి వలన ఉత్పన్నమయ్యే సిగ్గు , భయం, అవమానాలను ఈ వ్యాధిగ్రస్తుడు స్వయంగా తన అనుభవాలతో ఈ పుస్తకంలోని గొప్పతనం.
ఇందులో, భారతదేశంలో మనకు   లభించే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సౌకర్యాల ప్రశ్న సందర్భోచితంగా వుంది. నిజమే, మనం ఈ వ్యాధిగ్రస్తులను ఆశ్రమాలలో వుంచడమో  లేక ఒంటరిగా నిర్భమధించడమో చేసే రోజుల నుండి చాలా దూరమే వచ్చాం. సంఘంలో ఇముడ్చుకోడానికి మెల్లగా అంగీకరిస్తున్నాం. ఇపుడు మెరుగైన వైద్యం అందుబాటులో వుంది .మానసిక వేదనకు గురైన సామాన్యులందరికీ చేరాలంటే మనమింకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. మూఖ్య0గా గ్రామ ప్రాంతాలలో ఈ వ్యాధి గురించిన అవగాహన కలిగించడం అత్యంత ఆవశ్యకం. ఇది ఒక జాతీయ కార్యక్రమంగా దేశమంతటా చేపట్టవలిసి వుంది .
ఈ పుస్తకం  మానసిక ఆరోగ్యం రూపకర్తలు, వైద్యులు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలుకు ,  చాలా ఉపయోగపడుతుంది.

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

ధర :120/- పేజీలు, 148

Wednesday, July 20, 2016

అశుద్ధ భారత్ - రచన; భాషా సింగ్ ,తెలుగు అనువాదం: సజయఅనేజ్ గణాంకల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి సామార్థ్యలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోన్ని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించారు.అది వర్షకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్చు.లేదా వారిలో కొంత మంది తమ పనినే "వ్యాపారం"గా ఎలా మార్చకున్నారో కావొచ్చు. వీటిన్నిటికంటే కూడా క్రూరమైన  కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో  ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి.మనమిప్పటివరకూ వినని,కనని, ఆలోచించని భారతదేశపు మరో పార్శ్వాని మనముంధుకు తీసుకువచ్చి మన కళ్ళు తెరిపిస్తంది.
                           - జాన్ డ్రెజ్  (ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త)
"మనం సగర్వ భారతీయులం అని చెప్పుకోవటం అంటేనే, అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో  మన ప్రజలు అమానవీయమైన పాకీపని చేస్తూ తమ చేతులతో తోటిమనుషుల పెంటలను ఎత్తతున్నారనే వాస్తవాన్ని గుర్తించ నిరాకరించటమే. ఒక పక్కన చంద్రయానాలు  చేస్తూ, మరోపక్కన ఐటి రంగంలో దూసుకెళ్తున్న తరుణంలో ఇది కొనసాగటం దిగ్ర్బాంతికరమైన  విషయం. ఈ పుస్తకం అనేక గొంతులను ముందుకు తీసుకువచ్చింది. వీటిని మనం తప్పనిసరిగా విని సహానుభూతిని ప్రకటించాలి. తద్వారా ఈ అమానవీయమైన విధానాన్ని మన గత చరిత్రగా మార్చివేయాలి".    
                                                                                                                - మల్లికా సారాభాయ్
                                                                                               (ప్రముఖ నాట్యకళాకారిణి, సామాజిక కార్యకర్త .)
కేవలం పుట్టుక ద్వారా తోటి మనుషుల  పియ్యిపెంటలను ఎత్తి పారబోసే  పాకీ పనిచేసే వ్యక్తుల, సమూహాల వాస్తవ పరిస్థితి  బయటపెట్టంది అన్ సీన్ పుస్తకం. ఈ పనిని చాలా మంది ఊహించటానికి  కూడా ఇష్టపడరు
                                                                                                          ఎమ్ . వి . రమణ
                                                                                              (   ప్రిన్స్ టన్  యూనివర్సిటీలో ఫిజిసిస్ట్.)

" ద పవర్ ఆఫ్ ప్రామిస్: ఎగ్జామినింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా పుస్తక రచయిత    

ధర. : రూ. 150

మొదటి  ముద్రణ :జులై 2016
ఆంగ్లమూలం      : Unseen: The Truth about India's Manual Scavengers, Bhasha Singh, 2014, Penguin India
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

Monday, April 18, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర, రచన: వెండీ డోనిగర్‌, తెలుగు : టంకశాల అశోక్‌

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి.
కానీ, దీనిపై భారతదేశంలో చాలా దృష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫ్రిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్‌స్వాతంత్య్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
తరువాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు.

పుట్టుకతోనో, ఆచరణరీత్యానో హిందూ మతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి - ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది.

ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్నకులాలు, నిరక్షరాస్యుల వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణ రీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది.
.. ... ...

''నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్‌కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రదానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల వత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్లీమళ్లీ రాసారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది.

    హిందూ దేవతలను డోనిగర్‌ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు బలమైనట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది.''
............................................................................................- ప్రియంవద గోపాల్‌, ద గార్డియన్‌
.....

వెండీ డోనిగర్‌ -
సంస్కృత భాషలో, భారతదేశ అధ్యయనంలో హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలనుంచి రెండు డాక్టరేట్లు చేసారు. అనేక సంస్కృత కావ్యాలను, హిందూ మతంపై పలు రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బోధించారు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో మిర్సియా ఎలియేడ్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ ప్రొఫెసర్‌గా మతాల చరిత్రను బోధిస్తున్నారు.
...

టంకశాల అశోక్‌ -
 హైదరాబాద్‌, ఢిల్లీలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో విద్యాభ్యాసం జనధర్మ, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త, హన్స్‌ ఇండియా పత్రికలలో ఉద్యోగం ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌.
...

తెలుగు ప్రచురణకు రచయిత్రి ప్రత్యేక ఉపోద్ఘాతం

'ద హిందూస్‌ : ఏన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరీ' రచన తెలుగులో వెలువడుతుండటం నాకు సంతోషాన్ని, సంభ్రమాశ్చర్యాలను కూడా కలిగిస్తున్నది. అందుకు పలు కారణాలున్నాయి. నా రచనలు ఏదైనాసరే ఒక భారతీయ భాషలో వెలువడడం ఇది మొదటిసారి. నా రచనలలో ఈ విధంగా ఎక్కువమందికి అందుబాటులోకి రావాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే అది ఈ పుస్తకమే.

 పెంగ్విన్‌ సంస్థ 2010 లో ప్రచురించిన ఈ గ్రంథం ఎడిషన్‌ కోర్టు వివాదంలో చిక్కుకోవటం వల్ల నాకిట్లా అనిపిస్తున్నది. ఈ రచనను స్పీకింగ్‌ టైగర్‌ సంస్థ సాహసించి తిరిగి ఇంగ్లీష్‌ ఎడిషన్‌ వేయటం, ద హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అదే సాహసంతో  దీనిని శ్రమపడి తెలుగులోకి అనువదించి మరింతమంది భారతీయ పాఠకులకు అందుబాటులోకి తేవటాన్ని బట్టి, భారతదేశంలో వాక్స్వాతంత్య్రం పట్ల నాకు గొప్ప ఆశాభావం కలుగుతున్నది.

తెలుగు ఎడిషన్‌ పట్ల నాకు మరొకందుకు కూడా సంతోషం కలుగుతున్నది.
దక్షిణ భారతదేశం గురించి నేను రాయటం ఇది మొదటిసారి. (కొన్ని సంకలనాలలో రాసిన వ్యాసాలలో దక్షిణ భారతదేశ ప్రస్తావనలున్నాయి. వాటిలో ఆ ప్రాంత భాషా రచనల అనువాదాలను స్వీకరించాను. ఉదాహరణకు ఇటీవల వెలువడిన 'నార్టన్‌ ఆంథాలజీ ఆఫ్‌ వరల్డ్‌ రెలిజియన్స్‌' లో హిందూమతం గురించిన సంపుటికోసం రాసిన వ్యాసంలో తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు మూలాల నుంచి కొన్ని భాగాలు తీసుకున్నాను. వాటి గురించి అంటున్న మాట కాదిది.)

హిందూ మతం గురించి వెలువడిన ప్రధాన గ్రంథాలు అనేకం వదిలివేసిన కొన్ని వర్గాలవారరి స్వరాలను, ముఖ్యంగా స్త్రీలు, దళితులు, జంతుజాలాల స్వరాలను వినిపించేందుకు నా ఈ ప్రస్తుత రచనలో ప్రయత్నించాను. అదే విధంగా, నేను దక్షిణ దేశంపై సరైన విధంగా దృష్టి సారించటం ఎట్టకేలకు ఈ విధంగా మొదలవుతున్నది. అందువల్ల, ఈ రచనను తెలుగు పాఠకులు కూడా చదవనుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది.
. ...............................................................................................................వెండీ డోనిగర్‌
...............................................................................................షికాగో, డిసెంబర్‌ 25, 2015

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
రచన: వెండీ డోనిగర్‌
తెలుగు :  టంకశాల అశోక్‌

342 పేజీలు , వెల    : రూ. 275/-


ఆంగ్లమూలం    : The Hindus : An Alternative History, Penguin 2009 © Wendy Doniger 

ప్రథమ ముద్రణ    :    మార్చి 2016,

ప్రతులకు, వివరాలకు    :  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, 
 హైదరాబాద్‌ - 500 006.
ఫోన్‌ : 040 2352 1849
E Mail ID:      hyderabadbooktrust@gmail.com

.
 

Saturday, April 9, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో

అమెరికన్ ఇండాలజిస్ట్ వెండీ డోనిగర్ రాసిన,
టంకశాల అశోక్ తెలుగులోకి అనువదించిన
హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర  పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో


ఆంధ్ర జ్యోతి 9 ఏప్రిల్ 2016  సౌజన్యంతో  Friday, April 1, 2016

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర - రచన : వెండీ డోనిగర్ - తెలుగు అనువాదం : టంకశాల అశోక్ - పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర -
రచన : వెండీ డోనిగర్ -
తెలుగు అనువాదం : టంకశాల అశోక్ -
పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి  -

09ఏప్రిల్ 2016 సాయంత్రం 4-30 కి లామకాన్ లో

Monday, February 29, 2016

మరణ రాహిత్యానికి ప్రతీక జీనా హైతో మర్ నా సీఖో - టంకశాల అశోక్

మరణ రాహిత్యానికి ప్రతీక "జీనా హైతో మర్ నా సీఖో "  -  టంకశాల అశోక్(నమస్తే తెలంగాణ 28 ఫిబ్రవరి 2016 ఆదివారం అనుబంధం బతుకమ్మ సౌజన్యంతో ).

Monday, February 22, 2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

" దేశంలో భక్తి రసం తెప్పలుగా పారుతోంది 
...డ్రైనేజీ స్కీము లేక డేంజరు గా మారుతోంది "

అప్పుడెప్పుడో గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్లు ... దేశంలో భక్తి  రసం చాలా ఎక్కువైంది. వేదాలు, పురాణాల పట్ల రోజు రోజుకూ ఆసక్తి పెరిగిపోతోంది ....

పురాణాలు - మరోచూపు -
పుస్తక సమీక్ష
- చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016


Sunday, February 21, 2016

A Humanist Publisher

A Humanist Publisher

Realising the importance of intellectual revolution, former politician and founder of Hyderabad Book Trust, CK Narayana Reddy published good books at affordable price to spread greathuman values. ...

http://epaper.thehansindia.com/727892/SUNDAY-HANS/SUNDAY-HANS#page/15/1


Tha Hans India 21-2-2016

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌